నేను బారత ధేశాం లో పుట్టినాంధూకు గర్వ పడుతున్నాను=====
నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నాలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.పక్కా ప్రాక్టీకల్. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!
నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను..ఇంకొకటండి.. రాజ్ గాడు ఎవరిని ప్రేమించడు...ఎందుకో తెలుసా మీకూ??ప్రేమిస్తే ఎప్ఫుడు ఒక్కరినే ప్రేమించాలి..తన జీవితాన్ని ఎప్పుడు ఒక్కరికే అంకితం చెయ్యడం వాడికి ఎందుకనో ఇష్టం వుండదండి...అందుకే రాజ్ గాడు ఎప్పుడు ఫ్రీ బర్డ్...! "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో " అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..
కవితలు చెప్పే హృదయం వుంది !ప్రేమించే మనసు వుందిమనసులొన మంచి ఉహ వుందిఉహల లొకం లొ ఒక ఆశ వుందికలసి వుండే కోమలి యెక్కడ వుందొ?చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....?
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....
1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...
చిరునవ్వుతో..
మీ రాజ్
మర్చిపొయానండోయ్ అమెరికా విషయాలు చెప్పడం ...!అమెరికా వచ్చిన కొత్తల్లో బాగా ఖాళీ ఉండేది...అప్పుదు అనుకునే వాడిని, నేను ఎప్పుడు చూసినా ఇంత ఖాళీగా ఉంటున్నా, మరి అందరూ "బిజీ బిజీ లైఫ్. తినడానికి కూడా టైం ఉండదు, రెండు మూడు రోజులకొకసారి వండుకుని, దాచుకుని మరీ తింటూ ఉంటాం, స్నానానికి కూడా టైం ఉండదు" అని అంటూ ఉంటారేంటబ్బా అని ఒక ధర్మసందేహం వస్తూ ఉండేది ! కాని ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారు అయింది !! ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోతున్నా ! ఇంక వాగడం అంటారా అది సరేసరి ! అమెరికా వచ్చి సంవత్సరం కావస్తోంది !
ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, "ఎప్పుడొస్తున్నావయ్యా ?" అని పలికే నాన్న గంభీర స్వరం.... "నిన్ను చూడాలనుంది నాని" అని పలికే అమ్మ కమ్మని మాటలు విన్నప్పుడల్లా, దేవుడు మనిషికి రెక్కలు ఎందుకివ్వలేదా అని అనిపించేది.... చక్కగా ఇక్కడ ఎగిరి అక్కడ వాలి అందరినీ ఒకసారి చూసి వచ్చేయచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది !మళ్ళీ నా గొంతులో బాధ కనిపిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని, కొంచెం స్వరం పెంచి, "ఇంకెంతమ్మా ఒక ఏడదేగా" అని చెప్తూ ఉంటా ! ఇంకా మీతో పంచుకోవడనికి నా మదిలో చాలా మాటలున్నాయి...మళ్ళీ ఇలాగే సమయం దొరికినప్పుడు మిమ్మల్ని పలకరిస్తా !! అంత వరకూ సెలవు !